శ్రీదేవి కూతురి తో కరణ్ జోహార్ సినిమా!
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ప్రేక్షకులకు ఆమె అతిలోక సుందరి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆ క్రేజే వేరు. ఇప్పుడు ఆమె వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్ వెండితెర ఎంట్రీకి రెడీ అవుతుంది. జాన్వీ ఎంట్రీ కోసం చాలా గ్రాండ్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు శ్రీదేవి.బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. స్టార్ కిడ్ జాన్వి కపూర్ ను లాంఛ్ చేయడం అయితే ఖాయమే. అయితే ఇందుకు మరాఠీ మూవీ సైరత్ రీమేక్ ను ఎంచుకున్నారని గతేడాది వార్తలు వచ్చాయి. సునీష్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి.. షాహిద్ కపూర్ కి వరుసకు తమ్ముడు అయ్యే ఇషాన్ ఖట్టర్ లలో ఒకరిని హీరోగా తీసుకుంటారని అన్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయినట్లే అని తెలుస్తోంది. సైరత్ రీమేక్ కు శ్రీదేవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. హీరో విషయంలో కూడా ఇషాన్ ఖట్టర్ కే మొగ్గు చూపిందట శ్రీదేవి ఫ్యామిలీ. ఇప్పటికే కొన్ని సార్లు జాన్వి కపూర్- ఇషాన్ ఖట్టర్ కలిసి చక్కర్లు కొడుతూ మీడియా కంటబడ్డ సంగతి తెలిసిందే. ఇక ఈ హిందీ సైరత్ ను కరణ్ జోహార్ నిర్మించనుండగా.. రీసెంట్ గా బద్రీగానాథ్ కీ దుల్హనియా అంటూ బ్లాక్ బస్టర్ కొట్టిన శశాంక్ ఖేతాన్ దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై శ్రీదేవి నోటి వెంట అధికారికమైన ప్రకటన రానుంది.
No comments:
Post a Comment