Monday, 5 June 2017

కరణ్ జోహార్ చేతికి మహేష్ సినిమా

కరణ్ జోహార్ చేతికి మహేష్ సినిమా




పైసా పెట్టుబ‌డి లేకుండా ‘బాహుబ‌లి’ రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేయ‌డం ద్వారా భారీగానే డబ్బులు మూట‌గ‌ట్టుకున్నాడు బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూసర్ క‌ర‌ణ్ జోహార్. ‘బాహుబ‌లి’ ఇచ్చిన ఊపులో రానా సినిమా ‘ఘాజీ’ని కూడా అత‌ను త‌న బేన‌ర్ మీదే రిలీజ్ చేశాడు. మంచి ఫ‌లితాన్నే అందుకున్నాడు. ఇప్పుడ‌త‌డి క‌ళ్లు మ‌రో సౌత్ ఇండియన్ సినిమా మీద ప‌డ్డ‌ట్లుగా క‌నిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . జూన్ 1న రిలీజ్ అయిన స్పైడర్ టీజర్ దుమ్ము రేపుతోంది . సౌత్ లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది స్పైడర్ టీజర్ . ఇక ఈ టీజర్ ని చూసిన బాలీవుడ్ వాళ్ళు సైతం ఆశ్చర్యానికి లోనౌతున్నారు . బాహుబలి తర్వాత బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ చిత్రాల వైపు చూస్తున్నారు. అందులో మహేష్ నటించిన చిత్రం కావడం , మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్నా స్పైడర్ ని హిందీలో రిలీజ్ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే బాలీవుడ్ దర్శక దిగ్గజం కరణ్ జోహార్ కళ్ళు కూడా స్పైడర్ పై పడ్డాయి . స్పైడర్ ని కనుక కరణ్ రిలీజ్ చేస్తే బాక్స్ లు బద్దలు కావడం ఖాయం . కరణ్ జోహార్ బాహుబలి ని బాలీవుడ్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.


No comments:

Post a Comment