Monday, 5 June 2017

కొడుకు కోసం డైరెక్టర్లను సంప్రదిస్తున్నతండ్రి?

కొడుకు కోసం డైరెక్టర్లను సంప్రదిస్తున్నతండ్రి?




జాగ్వార్ సినిమాతో తెలుగులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అఖిల్ కుమార్ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో కుమారస్వామి నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇది ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సారి మాత్రం తన కొడుకుని ఎలా అయిన తెలుగు టాప్ హీరోగా నిలబెట్టాలని కుమారస్వామి అనుకుంటున్నట్లు సమాచారం.
 
దానికి ఆల్ రెడీ రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న టాప్ దర్శకులైన సురేందర్ రెడ్డి, వివి వినాయక్ లో ఎవరో ఒకరితో తన కొడుకుని రెండో సినిమా ద్వారా మరల భారీ స్థాయిలో తెలుగు జనానికి పరిచయం చేద్దామనే యోచనలో కుమార స్వామి వున్నట్లు సమాచారం. దీనిపై ఆ దర్శకులతో కూడా ఇప్పటికే చర్చలు జరిగినట్లు, ఎంత బడ్జెట్ అయిన పర్వాలేదు.
 
తన కొడుక్కి హిట్ ఇవ్వాలని కుమారా స్వామి వారిని అడిగినట్లు సమాచారం ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వాళ్ళు ఒకే అంటే త్వరలోనే బారీ బడ్జెట్ తో మరో కొత్త చిత్రం అఖిల్ కుమార్ హీరోగా వచ్చే ఏడాది తెలుగు వారికి మరింత చేరువయ్యే అవకాశం వుందని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.


No comments:

Post a Comment