Monday, 12 June 2017

తమ్ముడి కోసం అన్న పాట్లు?

తమ్ముడి కోసం అన్న పాట్లు?




అన్న‌కోసం త‌మ్ముడు.. త‌మ్ముడు కోసం అన్న! … ఇలాంటి స్టోరీలెన్నో విన్నాం. కానీ ఈ సినీ బ్ర‌ద‌ర్స్ స్టోరీనే వేరు. వింటే ఇంట్రెస్టింగ్‌.. సింటిలేటింగ్‌.. షివ‌రింగ్ .. అంటూ తెగ పొగిడేస్తారు.. అస‌లింత‌కీ ఏమా క‌థ‌?
 
`యుగానికి ఒక్క‌డు` త‌ర్వాత `ఆవారా` బంప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఇక కెరీర్ ప‌రంగా తిరిగి చూసుకోవాల్సిన ప‌నే లేని స్థాయికి ఎదిగాడు కార్తీ. ఆ త‌ర్వాత ఓ త‌మిళ‌ ఫ్లాప్ మూవీని `నా పేరు శివ‌`అనువాదించి.. తెలుగులో మ‌రో అద్భుత‌మైన స‌క్సెస్ అందుకున్నాడు. ఆ విజ‌యాల‌న్నీ అత‌డి మార్కెట్ రేంజుని అమాంతం పెంచేశాయి. కానీ ఎవ్వెరి డే ఈజ్ నాట్ వ‌న్స్ వోన్‌.. అందుకే కార్తీ కెరీర్‌లోకి రాహుకేతువు ప్ర‌వేశించాడు. ఆ త‌ర్వాత అత‌డి కెరీర్‌లో డౌన్ ఫాల్ మొద‌లైంది. బావుంది అనుకుంటుండ‌గానే ఊహించ‌ని ఫాల్‌.. వ‌రుస‌గా నాలుగైదు ఫ్లాప్‌లు కార్తీని చాలా ఇబ్బంది పెట్టాయి. చివ‌రికి నాగార్జున‌తో `ఊపిరి` సినిమా చేసేవ‌ర‌కూ ప‌రాజ‌యాల‌తో విసుగెత్తిపోయిన స‌న్నివేశం దాపురించింది.
 
ఇక కార్తీ 2016లో `ఊపిరి` స‌క్సెస్ అందుకున్న‌ త‌ర్వాత అదే ఏడాది `కాశ్మోరా` రూపంలో మ‌రో ప‌రాజ‌యం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. కార్తీ కెరీర్ డ్యామేజ్ ద‌శ‌లో ఉంది కాబ‌ట్టి ఇక‌ అన్న సూర్య రిపేర్లు స్టార్ట్ చేశాడ‌న్న‌ది తాజాగా కోలీవుడ్‌లో చెప్పుకుంటున్న మాట‌! త‌మ్ముడు కార్తీ కోసం.. అన్న సూర్య సొంత బ్యాన‌ర్ 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో ఓ సినిమాని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారిప్పుడు. ఆ మేర‌కు లేటెస్టుగా ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. కార్తీ హీరోగా పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో సూర్య నిర్మించే సినిమా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.
 
ప్ర‌స్తుతం త‌మిళంలో కార్తీ ఓ రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. `థీర‌న్ అధిగార‌మ్ ఒండ్రు`, `క‌రుప్పు రాజా వేళై రాజా అనే సినిమాలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమాల రిలీజ్‌లు అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతున్నాయి. ఈలోగానే అన్న నిర్మాత‌గా కార్తీ సినిమా ప్ర‌క‌ట‌న వెలువ‌డడంపై కోలీవుడ్‌, టాలీవుడ్‌లో గుస‌గుస‌లు మొద‌లైపోయాయ్‌. కార్తీ వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్నాడు.. ఇలాంటి టైమ్‌లో సినిమాలు ఏ కార‌ణం చేతనూ ఆగ‌కూడ‌దు. ఆగితే అది అత‌డి కెరీర్‌కి పూర్తిగా డ్యామేజ్ కిందే లెక్క‌. ఇక‌పోతే .. కార్తీ సాధ్య‌మైనంత తొంద‌ర‌గా ప్ర‌స్తుతం సెట్స్‌లో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి రిలీజ్‌కి తేవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని తెలుస్తోంది. కార్తీ అన్న‌ను మించిన త‌మ్ముడు. స్టామినాలో అత‌డికి తిరుగే లేదు. త‌న‌కి కెరీర్ ప‌రంగా బోలెడంత స్కోప్ ఉంది. ఒక‌వైపు అన్న సొంత బ్యాన‌ర్ సినిమాలు.. మ‌రోవైపు అన్న కోసం వ‌చ్చే నిర్మాత‌లు… త‌న‌వైపు చూసే స‌న్నివేశం.. ఇంకోవైపు త‌న‌ని అభిమానించి సినిమాలు తీసేవాళ్లు.. వెర‌సి కార్తీ కెరీర్‌కి ఇప్ప‌ట్లో ఢోఖా ఏమీ ఉండ‌దు. అయితే స‌రైన హిట్ కోసం .. స‌రైన ఎంపిక‌లు అవ‌స‌రం. అందులో కార్తీ వ‌రుస‌గా ఫెయిల‌వుతున్నాడు. అందుకే ఇప్పుడిలా అన్న సూర్య‌నే స్వ‌యంగా బ‌రిలోకి దిగార‌ని విశ్లేషిస్తున్నారు. ఏదైతేనేం.. ఇక‌ముందు కార్తీకి మంచి రోజులు మొద‌లైన‌ట్టేన‌ని అనుకోవ‌చ్చు. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా అత‌డు వ‌రుసగా హిట్టు మీద హిట్టు కొట్టాలి. మ‌రోసారి తెలుగు అభిమానుల్లో ఉత్సాహం నింపాల‌ని కోరుకుందాం.


No comments:

Post a Comment