పవన్ చాలా సిగ్గరి… సీనియర్ డైరెక్టర్ కామెంట్స్
సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య.. ఆయన తన పేరులో ఉన్న విధంగానే ఎన్నో ఆణి ‘ముత్యాల’ వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. టి.కృష్ణకు అసలైన సిసలైన వారసునిగా నిరూపించుకున్నాడు. సెంటిమెంట్, విప్లవాత్మకం, హాస్యం, సందేశం.. ఇలా ఎలాంటి చిత్రాలనైనా హ్యాండిల్ చేయడంలో ఆయన సిద్దహస్తుడు. ఇక ఇటీవల ఆయన మెగాకంఫౌండ్ కు దూరంగా ఉంటున్నారు.
తాజాగా ఆయన ఓ వెబ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గారితో ‘హిట్లర్’ చేసిన తర్వాత పవన్‌తో ‘గోకులంలో సీత’ చేసే అవకాశం వచ్చింది. పవన్ నిజంగా చాలా సిగ్గరి. అందరితో కలసిపోయినా ప్రతి విషయానికి ఎంతో సిగ్గుపడి పోతూ ఉంటాడు. గ్యాప్ దొరికితే పుస్తకాలు చదువుతో దానిలో లీనమైపోతుంటాడు. ఇక ఆయనలో చిరంజీవి తమ్ముడిని అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు.
ఆయనలో ఏదో తపన కనిపిస్తూ ఉండేది. పవన్ ఆనాడు పెద్ద కమర్షియల్ హీరో అవుతాడని నేను అనుకోలేదు. కానీ ఆయన నేడు తారా స్థాయికి ఎదిగాడు. తన వల్లనే సినిమాలు ఆడే స్థాయికి చేరుకున్నాడు. నేటితరంలో కొందరు ఒక్క సినిమా చేస్తేనే తామేదో గొప్ప అని, వారసులైతే తమకు తిరుగేలేదని తలబిరుసుగా వ్యవహరిస్తారు. కానీ పవన్‌ని చూస్తే ఆశ్చర్యం వేసేది. ఆయనలో ఏమాత్రం భేషజాలు ఉండేవి కావు… అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
No comments:
Post a Comment