Wednesday, 8 February 2017

పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మళ్లీ వార్?

పవన్, బన్నీ ఫ్యాన్స్ మధ్య మళ్లీ వార్?


‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ చేసిన అన్న ఒక్క కామెంట్‌‌ ఓ పెద్ద దుమారమే రేపింది. సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ బన్నీ పై విరుచుకుపడ్డారు. ఖైదీ నంబర్ 150 ఫంక్షన్‌లోనూ పవన్ అభిమానులు బాగానే రచ్చ చేశారు. అయితే అదంతా కాస్త సద్దుమణిగింది అనుకునేలోపే తాజాగా మరో వివాదానిసి ఫ్యాన్స్ తెరతీసినట్లు కనిపిస్తోంది. పైగా దానికి కారణం దువ్వాడ జగన్నాథం దర్శకుడు హరీష్ శంకరేనట. 
 
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు టీజర్‌‌ను కేవలం మూడు రోజుల్లోనే 5 మిలియన్ మంది చూశారు. ఇంత భారీగా స్పందన వచ్చినా ఇప్పటి వరకు మెగా హీరోలు ఎవరూ దీనిపై స్పందించలేదు.  ఇదిలా ఉంటే.. దువ్వాడ జగన్నాథం టీజర్, ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నామంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాను తాము చూసేది లేదంటూ హరీశ్ శంకర్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేయడం, కామెంట్స్  పెట్టడం చేశారు. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు. 
 

No comments:

Post a Comment